Tuesday, July 20, 2010

Nenu

ఈ రోజు నన్ను ఎన్నో ఏళ్లుగా  వాళ్ళ  ఇంట్లో  పెట్టుకొని  పోషించిన ఇంటి  పెద్ద  చనిపోయారు  బహుశా  నా  వల్లే  అనుకుంటా .  అయన  వ్యవసాయం  చేస్తూ  ఎప్పుడు  అప్పులో  నష్టాల్లో  ఉండే  వాడు ,ఎప్పుడైనా  బాగా  నష్టమోచ్చిన ,కష్టమొచ్చిన నన్ను  చూసి  ఏడ్చేవాడు  ఒక్కోసారి  నా  వల్లే  జరిగిందంటూ తిట్టేవాడు  నేను  వెల్లిపోదాం  అని  అనుకునే  అంతలో  అక్కున  చేర్చుకునే  వాడు.
 నాకు సరిగ్గా  గుర్తులేదు  కానీ  వాళ్ళ  పెళ్ళైన  కోత్హలో   అనుకుంట  నాకు  వాళ్ళ  ఇంట్లో  చోటు  ఇచ్చారు   వాళ్ళ  పిల్లలకన్నా  నన్నే   బాగా  చుస్కునేవారు  నన్ను  ఎప్పుడు  బాధ  పెట్టె  వారు  కాదు  అందుకే  నేను  కూడా  వాళ్ళకి మంచే చేశా   అహంకారం  అనేది  లేకుండా ,ధైర్యంగా  ఉండేలా ,ఎదుటివాడికి  సహాయం  చేసేలా ,ఉన్నదాంట్లో  తృప్తి  పడడం  ఎలాగో  నేర్పించా,కష్టల్లోనే  అసలైన  సుఖం  ఉందని  తెలిసేలా  చేశా,ఇలాంటి  నన్ను  ఓసారి  వాళ్ళ  పెద్దోడికి  మంచి  వ్యాపారం  పెట్టించారని   దానికి నేను  అడ్డుగా  ఉన్నానని  నన్ను  ఇంట్లో  నుంచి  పంపెద్ధం  అనుకున్నారు  కానీ  అంతలోనే  నష్టమోచ్చేసరికి  చాల  బాధ  పడి  ఇక  ఎప్పటికి  వాళ్ళ  తోనే  ఉండాలని  చెప్పారు  అప్పటి  నుంచి  ఇంకా  బాగా  చుస్కునే  వారు  ఎంత  బాగా  అంటే  వాళ్ళు  నా  వల్ల  గంజి  తాగే  వాళ్ళు ,అయిన అప్పుడు  చేసిన  పనికి  వాళ్ళు  చనిపోవాలని  అనుకునేల  చేశా  పొలంలో  వేసే  పురుగుల  మందు   తాగి  చనిపోధం  అనుకునారు   కానీ  అది   కూడా  నావల్లె   కల్తిది  కొనడంతో  ఏమి  కాలేదు ,అప్పటినుంచి  వీళ్ళ  మనువల్లని   బడికి  వెళ్ళకుండా ,వొంటికి  సరైన  బట్ట  కూడా  కట్టకుండా ,ఇంట్లో  ఉన్న  వస్తువులన్నీ  అమ్ముకునేలా  ఇలా  వీళ్ళని  అన్ని  విధాల  కష్టపెట్ట ,ఒక  సరైతే  వాళ్ళని  దొంగతనం  చేయడానికి  ప్రేరేపించ ,వాళ్ళ అమ్మాయి  విధవరాలు  అవడానికి  కారణం  నేనే ,న  వల్లే  వాళ్ళ  కోడలిని  అందరు  వ్యబిచారిని  అనే  వాళ్ళు ,నలుగురు  చూసి నవ్వే  వాళ్ళు ,వీళ్ళ  శత్రువులు  నన్ను పొగిడే వాళ్ళు  అలానే వాళ్ళ  జోలికి  మాత్రం   రావోద్హని  వేడ్కునే  వాళ్ళు, ఇవన్ని  చేసిన  నన్ను  బాగానే  చుస్కున్నారు  కానీ  ఈ రోజు  నాకు  బయపడి  చనిపోయాడు.
నేనే  కాదు  నాలాగే నా బంధువులు ,స్నేహితులు గుడిసెల్లో,పెంకుటిల్లల్లో   నాలాగే జీవిస్తుంటారు,  కష్టపడ్తుంటారు  ఇంతకి  నా  పెరెంటంటే  'పేదరికం'  నన్ను  అందరు  ముద్హుగా  దరిద్రం  అని   కూడా  అంటారు.






ఎవరో తెల్సింది కాబట్టి  ఇంకోసారి   లోతుగా  విశ్లేసిన్చుకుంటూ చదవండి
Powered By Blogger