Saturday, September 25, 2010

ఓ అందమైన అమ్మాయి

              పడుకున్న  నన్ను  మా  నాన్న  లేపుతునట్టు  అనిపించింది  లేరా  బాబు  అంటే  కొడైన  కుయాక  ముందే  లేపుతున్నావ్  ఏంటి  సండే  అయిన పడుకోనివ్వు  అన్న  కోడి  కుయడమే  కాదు  కోయడము  తినడము   కూడా  అయింది  అనటంతో  బలవంతంగా  లేసి  బ్రష్  వేస్కొని టిఫిన్  కోసం  కూర్చున్న . మా  అమ్మ  స్నానం  చెయ్  రా  అంటే  ఈ  రోజు  సండే  కదా  తర్వాత  చేస్తా  అంటే  మరి  సండే  నే  కదా  తిండి  కూడా  తర్వాతనే  తిను  అంది  తిస్కురా  అమ్మ  తొందరగా  అని  తినేసి  టీ.వీ  ముందు  కూర్చున్న.అంతలోనే  కాలింగ్  బెల్  విన్పించింది  ఏ  పేపర్  వాడో  వచ్చి ఉంటాడు  వాంది  ఏ  పేపర్  అయితే  మాది  అదే  పేపర్  అని  చెప్పి  పంపెద్ధం  అనుకోని  తలుపు  తెరిచా  గుండెల్లో  జివ్వు  మంది  ఎందుకంటే  తలుపు  తట్టింది  పేపర్  వాడో  పాల  వాడో  కాదు  అందమైన  అమ్మాయి  నాలుగు  కప్పులు  ఓ  ఫ్లాస్కో  పట్టుకొని  ఉంది  ఆంటీ  అని  అంది  అమ్మ  పనిలో  ఉంది  పర్లేదు  నాకు  ఇవ్వండి  అంటూ  నేను  తీసుకున్న  థ్యాంక్స్  అని  ఓ  నవ్వు  నవ్వింది  అది  ఎలా  ఉందంటే  మొగ్గల  ఉన్న పువ్వు   వికసిoచినప్పుడు  ఎంత  అందంగా  ఉంటుందో  బిగుసుకొని  ఉన్న  తన  పేదాలు  ఓ నవ్వుతో  విచ్చుకున్నప్పుడు   అంతే  అందంగా  అన్పించింది  ఓవర్  గా  ఉంది  కదా ! నాకు  అలానే  అన్పించేది  కానీ  ఇప్పుడే  ఇలా  ఏంటో  మరి ? తను వెళ్ళింది  నేను  లోపలి  కి  వచ్చి  అమ్మ ఎవరో  అమ్మాయి  ఈ కప్  లిచ్చి  వెళ్ళింది  అంటే  ఎవరో  కాదురా  మన  ఎదురింటిలోకి   వచ్చారు  పాపం  నాన్న  లేడనుకుంటా   రా  ముగ్గురే  ఉన్నారు  అనడంతో  నేను  బయటకి  వచ్చి  చుశా   సమాన  సద్దుతు  తన  అన్న ఇంకా  అమ్మ  అనుకుంట  కన్పించారు  తను  బయట  లేదు  లోపల  పనిలో  ఉన్నటుంది  అనకున్న  దాదాపు  అ  రోజంతా  అక్కడే  గడిప  అనుకుంట .
                                          నెక్స్ట్  డే  కోడి  కుత  తోనే  లెస  కోయక  ముందే  రెడీ  అయి  టిఫిన్  చేసి  బయటకి  వచ్చి  బండి తుడుస్తూ  ఓ  అరగంట  గడిపా  తను  కనపడ  లేదు  అంతలోనే  మా  అమ్మ  ఇంకా  బయటే  ఉన్నవెంటిర  ఎప్పుడు  లెండి  బండి  తుడుస్తున్నావ్  ఏంట్రా  అంది  అంతలోనే  మా  నాన్న  ఎవడో  బాగా  ఎక్కిరించుంటాడు  అని  అంటుండగానే  సర్లే  అని బoడి  స్టార్ట్  చేసి  బయటకి  వస్తు  వాళ్ళ  ఇంటి  వైపు  చూశ  ప్చ్  లాబం  లేదు  కనపడాల  ఇంత  బాగా  రెడీ  అయింది  వేస్ట్  ఏ  కదా  అనుకుంటూ  ఆఫీసు  కెళ్ళి  సాయంత్రం  డైరెక్ట్  గా  ఇంటికి  వచ్చి  మెడ  పైకి  ఎక్క  రెండు  మూడు  సార్లు  కన్పించించింది  ఇన్నాలకు  మా  ఇంటి  దగ్గరలోకి  ఓ  అందమైన  అమ్మాయి  వచ్చిందని  సంబరపడుతూ  వెళ్లి  పడుకున్న, ఇళానే   వారం  అంత  గడచింది  మళ్ళి  నెక్స్ట్  సండే  కోడి  కుసి  కోసాక  లేచి  టిఫిన్  చేసి  టీ.వీ  ముందు  కూర్చున్న  ఎవరో  కాలింగ్  బెల్  కొడితే  తనే  అనుకోని  వెళ్లి  తలుపు  తీస్తూ  కాళ్ళని  చుశా  కాళ్ళకి  మెట్టలు  ఉన్నాయ్  ఎవరా  అనుకుంటూ  మెళ్లిగా  పైకి  చూశ   మళ్ళి  గుండె  జివ్వు మంది  ఈ  సరి  అది  అంటూనే  ఉంది  ఎందుకంటే  స్వీట్  బాక్స్  పట్టుకొని  తను  ఉంది  అంతలోనే  మా  అమ్మ  వచ్చింది  స్వీట్  ఇచ్చి  తను  తల్లి  కాబోతున్న  అని  చెప్పింది  నేను  అలానే  కుర్చిలోకి  పడిపోయా  నాక్కూడా  స్వీట్  ఇచ్చింది  నాకు  తెలియకుండానే  కంగ్రాట్స్  చెప్పా  మల్లి  నవ్వు  నవ్వి  వెళ్ళింది  ఈ  సారి  నా  మనసుని  నాకు  వొదిలేసి.


అప్పుడు  నాకొక  విషయం  అర్ధం  అయింది  వాళ్ళు  కొత్తగా  పెళ్లై  కాపురం  పెట్టడానికి  వచ్చరని   తను  వాళ్ళ  అన్న  కాదు  బర్త  అని, ఆమె  వాళ్ళ  అమ్మ  కాదు  అత్త  అని, చివరిగా  ఇది  అమ్మయి   కాదు  కాబోయే  అమ్మ అని..!

Tuesday, July 20, 2010

Nenu

ఈ రోజు నన్ను ఎన్నో ఏళ్లుగా  వాళ్ళ  ఇంట్లో  పెట్టుకొని  పోషించిన ఇంటి  పెద్ద  చనిపోయారు  బహుశా  నా  వల్లే  అనుకుంటా .  అయన  వ్యవసాయం  చేస్తూ  ఎప్పుడు  అప్పులో  నష్టాల్లో  ఉండే  వాడు ,ఎప్పుడైనా  బాగా  నష్టమోచ్చిన ,కష్టమొచ్చిన నన్ను  చూసి  ఏడ్చేవాడు  ఒక్కోసారి  నా  వల్లే  జరిగిందంటూ తిట్టేవాడు  నేను  వెల్లిపోదాం  అని  అనుకునే  అంతలో  అక్కున  చేర్చుకునే  వాడు.
 నాకు సరిగ్గా  గుర్తులేదు  కానీ  వాళ్ళ  పెళ్ళైన  కోత్హలో   అనుకుంట  నాకు  వాళ్ళ  ఇంట్లో  చోటు  ఇచ్చారు   వాళ్ళ  పిల్లలకన్నా  నన్నే   బాగా  చుస్కునేవారు  నన్ను  ఎప్పుడు  బాధ  పెట్టె  వారు  కాదు  అందుకే  నేను  కూడా  వాళ్ళకి మంచే చేశా   అహంకారం  అనేది  లేకుండా ,ధైర్యంగా  ఉండేలా ,ఎదుటివాడికి  సహాయం  చేసేలా ,ఉన్నదాంట్లో  తృప్తి  పడడం  ఎలాగో  నేర్పించా,కష్టల్లోనే  అసలైన  సుఖం  ఉందని  తెలిసేలా  చేశా,ఇలాంటి  నన్ను  ఓసారి  వాళ్ళ  పెద్దోడికి  మంచి  వ్యాపారం  పెట్టించారని   దానికి నేను  అడ్డుగా  ఉన్నానని  నన్ను  ఇంట్లో  నుంచి  పంపెద్ధం  అనుకున్నారు  కానీ  అంతలోనే  నష్టమోచ్చేసరికి  చాల  బాధ  పడి  ఇక  ఎప్పటికి  వాళ్ళ  తోనే  ఉండాలని  చెప్పారు  అప్పటి  నుంచి  ఇంకా  బాగా  చుస్కునే  వారు  ఎంత  బాగా  అంటే  వాళ్ళు  నా  వల్ల  గంజి  తాగే  వాళ్ళు ,అయిన అప్పుడు  చేసిన  పనికి  వాళ్ళు  చనిపోవాలని  అనుకునేల  చేశా  పొలంలో  వేసే  పురుగుల  మందు   తాగి  చనిపోధం  అనుకునారు   కానీ  అది   కూడా  నావల్లె   కల్తిది  కొనడంతో  ఏమి  కాలేదు ,అప్పటినుంచి  వీళ్ళ  మనువల్లని   బడికి  వెళ్ళకుండా ,వొంటికి  సరైన  బట్ట  కూడా  కట్టకుండా ,ఇంట్లో  ఉన్న  వస్తువులన్నీ  అమ్ముకునేలా  ఇలా  వీళ్ళని  అన్ని  విధాల  కష్టపెట్ట ,ఒక  సరైతే  వాళ్ళని  దొంగతనం  చేయడానికి  ప్రేరేపించ ,వాళ్ళ అమ్మాయి  విధవరాలు  అవడానికి  కారణం  నేనే ,న  వల్లే  వాళ్ళ  కోడలిని  అందరు  వ్యబిచారిని  అనే  వాళ్ళు ,నలుగురు  చూసి నవ్వే  వాళ్ళు ,వీళ్ళ  శత్రువులు  నన్ను పొగిడే వాళ్ళు  అలానే వాళ్ళ  జోలికి  మాత్రం   రావోద్హని  వేడ్కునే  వాళ్ళు, ఇవన్ని  చేసిన  నన్ను  బాగానే  చుస్కున్నారు  కానీ  ఈ రోజు  నాకు  బయపడి  చనిపోయాడు.
నేనే  కాదు  నాలాగే నా బంధువులు ,స్నేహితులు గుడిసెల్లో,పెంకుటిల్లల్లో   నాలాగే జీవిస్తుంటారు,  కష్టపడ్తుంటారు  ఇంతకి  నా  పెరెంటంటే  'పేదరికం'  నన్ను  అందరు  ముద్హుగా  దరిద్రం  అని   కూడా  అంటారు.






ఎవరో తెల్సింది కాబట్టి  ఇంకోసారి   లోతుగా  విశ్లేసిన్చుకుంటూ చదవండి
Powered By Blogger